సంక్రాంతి పండ‌గ‌కి ఊరెళ్తున్నారా.. అయితే ఈ రైళ్ల టైమింగ్స్ మారాయండోయ్‌..

పండుగ సీజ‌న్ మొద‌లైంది. మ‌రి సెలవుల్లో పండ‌గ‌కి ఊరెళ్తున్నారా..? అయితే కొన్ని రైళ్ల టైమింగ్స్ మారాయి. ఈ విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల రద్దీకి తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ వివరాలను రైల్వే ప్రకటించింది. కాచిగూడ-శ్రీకాకుళం రోడ్ రూట్‌లో 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 07016 నెంబర్ గల రైలు 2020 జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 06.45 గంటలకు కాచిగూడలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది.

తిరుపతి నుంచి కాచిగూడకు 8 ప్రత్యైక రైళ్లు నడుస్తాయి. 07146 నెంబర్ గల రైలు 2020 జనవరి 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 05.00 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 06.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి రూట్‌లో 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 07479 నెంబర్ గల రైలు 2020 జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 04.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌లో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09.25 గంటలకు రైలు తిరుపతికి చేరుకుంటుంది.