మరో చిన్నారి ప్రాణం కాపాడిన మహేష్ బాబు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 47 సంవత్సరాల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా యవ్వనంగా అందంగా కనిపించడం ఒక మహేష్ బాబుకి చేతన అయ్యింది. అయితే అందమైన రూపంతో పాటు అంతకంటే అందమైన మనసు మహేష్ బాబు సొంతం.. ఎందరో చిన్నారుల గుండె చప్పుడులో మహేష్ పేరు ప్రతిధ్వనిస్తుంది. సుమారు రెండు వేల మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి వారికి నూతన జీవితాన్ని ఇచ్చారు మహేష్ బాబు. తాజాగా ఇప్పుడు మరో ఏడేళ్ల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి చిన్నారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు.

మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ చిన్నారుల సంఖ్య రోజుకు పెరుగుతూనే ఉంది. ఈ బాలుడు టెట్రాలజీ ఆఫ్ ఫారెస్ట్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు పదివేల మంది నవజాత శిశువుల్లో ముగ్గురిలో ఈ సమస్య కనిపిస్తోంది . అందుకే చిన్న వయసులోనే పిల్లలకు తగిన చికిత్స అందిస్తేనే ప్రమాదం ఉండదు. ఏడేళ్ల చిన్నారి క్రాంతి కుమార్ కూడా ఈ సమస్యతోనే జన్మించాడు. వీరు ఆ సమస్య కాస్త మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో ఆయన గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు. బాలుడికి ఆంధ్ర హాస్పిటల్ లో గుండె ఆపరేషన్ చేయించారు.

మహేష్ బాబు చిన్నారుల కోసం ఈ ఫౌండేషన్ ను స్థాపించి ఎంతోమంది కుటుంబాలలో వెలుగులు నింపుతున్నాడు. ఇది చూసిన మహేష్ బాబు అభిమానులు సంబరపడిపోతున్నారు.