Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ సూపర్ సెల్ఫీ..పిక్ వైరల్

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.


‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి.

ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. తాజాగా స్టైలీస్ లుక్ లో మహేష్ బాబు కనిపించారు. తన ఐ ఫోన్ లో పిక్ దిగి..సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news