IND vs AUS : దినేష్ కార్తీక్ మెడ పట్టుకుని, చంపేందుకు చూసిన రోహిత్ శర్మ..!

-

మొహాలిలో జరిగిన తొలి మ్యాచ్ లో ​ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. నాలుగు వికెట్ల తేడాతో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠగా సాగిన తొలి టీ20లో భారత జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. జట్టు సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. కెమరూన్​ గ్రీన్​(61) టాప్ స్కోర్. స్మిత్​ (35) పర్వాలేదనిపించగా..​ చివర్లో మ్యాథ్యూ వేడ్(45)​ బాగా రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్​ 3, ఉమేశ్​ యాదవ్​ 2, చాహల్​ ఓ వికెట్ తీశారు.


అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ… టీమిండియా కీపర్ దినేష్ కార్తీక్ గొంతు పట్టుకున్నాడు. ఉమేష్ బౌలింగ్ లో స్మిత్ మరియు మ్యాక్స్ వెల్ భారీ షాట్లకు ప్రయత్నించగా బ్యాట్లను తాకుతూ బంతి కార్తిక చేతిలో పడింది. రెండుసార్లు ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చాడు. రివ్యూ కు వెళ్లగా వికెట్లు దక్కాయి. దీంతో వెంటనే రోహిత్ శర్మ గట్టిగా అప్పిల్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ డీకే పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు అతడి గొంతు పట్టుకొని సీరియస్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news