మహేష్ బాబు తల్లి మరణం..పవన్ కళ్యాణ్, చిరు సంతాపం

టాలీవుడ్‌ హీరో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం కలిగింది. అనారోగ్య సమస్యలతో మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. అయితే.. మహేష్ బాబు తల్లి మరణం..పట్ల పవన్ కళ్యాణ్, చిరు సంతాపం తెలిపారు.


ప్రముఖ నటులు శ్రీ కృష్ణ గారి సతీమణి, శ్రీ మహేష్ బాబు గారి మాతృమూర్తి శ్రీమతి ఇందిరాదేవి గారు తుది శ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందన్నారు పవన్ కళ్యాణ్. శ్రీమతి ఇందిరా దేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ బాధ నుంచి శ్రీ కృష్ణ గారు, శ్రీ మహేష్ బాబు గారు త్వరగా కోలుకొనే మనో ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిసున్నానని తెలిపారు పవన్ కళ్యాణ్.

శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ , సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని చిరు కూడా ట్వీట్‌ చేశారు.