వెకేష‌న్ కోసం ఫ్యామిలీతో ఫ్లైటెక్కిన మ‌హేష్

స్టార్ హీరో మ‌హేష్‌బాబు చాలా విరామం త‌రువాత మ‌ళ్లీ ఫ్యామిలీతో వెకేష‌న్‌కి బ‌య‌లుదేరాడు. శ‌నివారం రాత్రి వైఫ్ న‌మ్ర‌త, పిల్ల‌లు గౌత‌మ్‌, సితార‌తో క‌లిసి ‌మ‌హేష్ శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌లో సంద‌డి చేశారు. ఎనిమిది నెల‌ల విరామం త‌రువాత మ‌హేష్ ఫ్యామిలీ విహారం కోసం విదేశాల బాట‌ప‌ట్టారు. ఫ్యామిలీతో క‌లిసి ఆయ‌న యుఎస్ వెళుతున్నారు.

మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి అమెరికాలో జ‌ర‌గ‌బోతోంది. 40 రోజుల పాటు కీల‌క ఘ‌ట్టాల‌ని అక్క‌డ షూట్ చేయ‌బోతున్నారు. వీసాల‌కు సంబంధించిన ప‌నులు పూర్త‌యిపోవ‌డంతో ముందుగానే మ‌హేష్ యుఎస్ వెళుతున్నారు.

ఈ సందర్భంగా మ‌హేష్ ఎయిర్ పోర్ట్‌లో త‌న పిల్ల‌తో క‌లిసి తీసుకున్న సెల్ఫీ వైర‌ల్‌గా మారింది. `కొత్త సాధారణ ప‌రిస్థితుల‌ను అలవాటు చేసుకోవడం !! సురక్షితమైన విమానానికి అంతా సన్నద్ధమయ్యాయి. జీవితం మ‌ళ్లీ ట్రాక్ ఎక్కింది. గెట్ సెట్ గో`అని మ‌హేష్ ట్వీట్ చేశారు.