క్రికెట్ ఆడుతున్న మహేష్..!

-

భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న మహర్షి సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహేష్ కొద్దిసేపు క్రికెటర్ గా కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాలో మహేష్ లుక్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుండగా మహేష్ క్యారక్టరైజేషన్ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందట. మహేష్ లాంటి స్టార్ హీరో క్రికెట్ ఆడితే ఇక అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమ తర్వాత మహేష్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. సుకుమార్ తర్వాత అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ డైరక్షన్ లో కూడా మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమా విషయంలో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ అవడం లేదు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news