మహేష్ ‘మహర్షి’ న్యూ ఇయర్ గిఫ్ట్..!

-

సూపర్ స్టార్ మహేష్, వంశీ పడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా వతున్న ఈ మూవీ ప్రెస్టిజియస్ గా తెరకెక్కుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటివరకు మహర్షి సినిమా నుండి ఓ చిన్న టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుండి ఓ క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మహేష్ స్టైలిష్ వాక్ తో వెనుక తన సెక్యురిటీతో రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయిందని చెప్పాలి. సినిమాలో మహేష్ డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ టీజర్ గా వచ్చిన పోస్టర్ కు ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ కు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఊపిరి తర్వాత వంశీ పైడిపల్లి తన సత్త చాటేలా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఏప్రిల్ 5న మహర్షి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న సినిమాగా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. మరి మహర్షి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో తెలియాలంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news