ఆర్నాల్డ్ ను గుర్తు చేస్తున్న చరణ్ పోస్టర్.. ఊర మాస్ కాదు అంతకుమించి..!

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్ది సినిమా నుండి డిఫరెంట్ పోస్టర్స్ వదులుతున్నారు. రీసెంట్ గా చరణ్ ఒంటి నిండా టాటూలేసుకుని గన్ పట్టుకుని నిలుచుకున్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ చూసి హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ తో చరణ్ ను పోల్చేస్తున్నారు. టర్మినేటర్ సీరీస్ లో ఆర్నాల్డ్ ను పోలినట్టుగా చరణ్ వినయ విధేయ రామలో విధ్వంసం సృష్టించడం ఖాయమని అనిపిస్తుంది. పోస్టర్ చూసిన మెగా ఫ్యాన్స్ మాత్రం బోయపాటి శ్రీనుకి థ్యాంక్స్ చెబుతున్నారు. చరణ్ లోని ఈ మాస్ యాంగిల్ ను బయటపెడుతున్న బోయపాటి శ్రీను ఈ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబేరాయ్ ఈ మూవీలో విలన్ గా నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news