మహేష్ మహర్షి హింది రైట్స్ రికార్డ్

-

సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా సగానికి పైగా పూర్తి చేసుకుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలిసిందే. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి చేస్తున్న ఈ సినిమా హింది డబ్బింగ్ రైట్స్ అదిరిపోయే రేటు పలుకుతున్నాయట.

బాలీవుడ్ లో తెలుగు సినిమాల హడావిడి ఈమధ్య బాగుందని చెప్పొచ్చు. డబ్బింగ్ సినిమాలే అయినా తెలుగు సినిమాలు యూట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. చరణ్ బోయపాటి సినిమా కూడా హింది రైట్స్ 22 కోట్లకు అమ్ముడవగా ఇప్పుడు ఆ రికార్డ్ బ్రేక్ చేస్తూ మహేష్ మహర్షి సినిమా ఏకంగా పాతిక కోట్లకు కేవలం హింది డబ్బింగ్ రైట్స్ ద్వారా రాబట్టిందట.

టీజర్ తోనే సినిమా రేంజ్ ఊహించిన హింది డిస్ట్రిబ్యూటర్స్ మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ తో కచ్చితంగా తమకు లాభాలే వస్తాయని ఆశిస్తున్నారు. చూస్తుంటే మహేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news