నిత్యా మీనన్ ‘మహానటి’ కాబోతుందా..!

-

టైటిల్ చూసి కాస్త కన్ ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నిత్యా మీనన్ ఎలా మహానటి అవుతుంది. ఆల్రెడీ మహానటి సావిత్రి బయోపిక్ తో కీర్తి సురేష్ తన సత్తా చాటింది కదా మరి మళ్లీ నిత్యా మీనన్ ఎలా మహానటి కాబోతుంది అంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ కోసమని తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలో సావిత్రి పాత్రను రాసుకున్నాడట క్రిష్.

ఈ సినిమాలో సావిత్రిగా మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ ను అడిగితే కాదన్నదట. డేట్స్ అడ్జెస్ట్ చేయలేని కారణంగా ఆమె ప్లేస్ లో నిత్యా మీనన్ ను మహానటిగా సెలెక్ట్ చేశారు. నాగ్ అశ్విన్ మహానటి సినిమాకు కూడా మొదట నిత్యా మీనన్ నే సావిత్రి పాత్రకు అనుకున్నారు కాని లావు పెరగడం తనవల్ల కాదని ఆ ప్రాజెక్ట్ వదులుకుంది నిత్య.

అయినా సరే మళ్లీ సావిత్రి పాత్ర తన దగ్గరకే వచ్చింది. చంద్రబాబుగా రానా, ఏయన్నార్ గా సుమంత్, హరికృష్ణగా కళ్యాణ్ రాం నటిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో నిత్యా ఎలా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news