ఈమధ్య స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. అంచనాలను మించి హిట్ అనిపించిన సినిమా యూనిట్ కు తానే ఓ స్పెషల్ పార్టీ ఎరేంజ్ చేస్తున్నాడు. మొన్నామధ్య మహానటి సినిమా హిట్ తర్వాత బన్ని ఆ సినిమా దర్శక నిర్మాతలు ఆర్టిస్టులందరికి పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో మిగతా స్టార్ డైరక్టర్స్ ను బన్ని ఇన్వైట్ చేశాడు కూడా.
ఇక ఇప్పుడు అలాంటి సేమ్ పార్టీనే బన్ని మరోసారి ఇవ్వబోతున్నాడట. అయితే ఈసారి గీతా గోవిందం చిత్రయూనిట్ కు ఈ పార్టీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీతా గోవిందం మూవీ అంచనాలను మించి వసూళ్లను రాబడుతుంది. 3 రోజుల్లో 37 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా చూస్తుంటే 70 కోట్ల దాకా వసూళు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా సక్సెస్ ను పురస్కరించుకుని బన్ని ఓ స్పెషల్ పార్టీ ఇస్తున్నాడట. ఈ పార్టీకి గెస్ట్ గా మహేష్ ను పిలుస్తున్నారట. గీతా గోవిందం సినిమాపై దర్శకుడు రాజమౌళి తర్వాత మహేష్ బాబే తన స్పందన తెలియచేశాడు. సినిమా చూసిన మహేష్ చిత్ర దర్శక నిర్మాతలతో పాటుగా లీడ్ కాస్ట్ ను పొగిడేశాడు. అందుకే ఈ స్పెషల్ పార్టీలో మహేష్ కు స్థానం కల్పిస్తున్నారు. మహేష్ వస్తే కనుక ఈ పార్టీ మరింత స్పెషల్ అవుతుందని చెప్పొచ్చు.