బాలీవుడ్ లో ఒక జంట పెద్ద హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వారే పెళ్ళై టీనేజ్ కుమారుడు ఉన్న మలైకా అరోరా,ఆమె బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్. వీరిద్దరి గురించి ఇండస్ట్రీ మొత్తం పెద్ద టాక్. కేవలం అర్జున్ కోసమే తన వైవాహిక జీవితానికి గుడ్ బై పలికి అర్బాజ్ ఖాన్ కు మలైకా విడాకులు ఇచ్చింది అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అర్బాజ్ కు విడాకులు ఇచ్చిన తరువాత నుంచి కూడా ఈ జంట ఎక్కువగా పార్టీ లలో దర్శనమిస్తూ కనిపిస్తున్నారు. 45 ఏళ్ల వయసు లో మలైకా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాల్ వేసుకొని ప్రతి ఒక్క పార్టీ కి హాజరువుతుండడం తో పెద్ద హాట్ టాపిక్ గా మారింది వీరి వ్యవహారం. రీసెంట్ గా ముంబై లో ఒక పార్టీ జరుగగా,ఆ పార్టీ కి తన క్రేజీ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో కలిసి ఉత్సాహం గా హాజరైంది. బ్లాక్ ప్యాంట్,వైట్ టాప్ ధరించి బటన్స్ పెట్టుకోకుండా పైన ఒక జాకెట్ వేసుకుంది. మెడలో ఓ వైట్ నెక్లెస్ ధరించింది. చేతిలో ఒక పెద్ద బ్లాక్ కలర్ బ్యాగ్ పట్టుకుంది. హై హీల్స్ తో తనకు ఫ్యాషన్ సెన్స్ ఎలా ఉందో చెప్పకనే చెప్పింది.
అర్జున్ తో కలిసి మాత్రమే కాకుండా.. విడిగా కూడా ఫోటోలకు పోజులిచ్చింది. అయితే వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన నెటిజన్లు త్వరలోనే వారిద్దరూ వివాహ బంధానికి వెల్కమ్ చెప్పేలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో బయటకు రావడం తో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అర్జున్ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’.. ‘చలే చలో’ అనే సినిమాల్లో నటిస్తుండగా,మలైకా చేతిలో ఒక్క చిత్రం కూడా లేని సంగతి తెలిసిందే.