కథానాయిక అన్న తర్వాత చిన్నా పెద్దా అన్న తేడా ఉండదు. కొందరు మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టి స్టార్ క్రేజ్ తెచ్చుకుంటే మరికొందరు స్లో అండ్ స్టడీగా కెరియర్ సాగిస్తూ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటారు. అయితే ఈ రెండిని చేయలేని కొందరు అడపాదడపా సినిమాలు చేస్తూ కెరియర్ వెళ్లదిస్తూ ఉంటారు. అయితే వెస్ట్రన్ కల్చర్ బాగా అలవరచుకున్న నేటి తరం భామలు సినిమాలు చేస్తున్నా చేయకున్నా సరే ఆడియెన్స్ ను మాత్రం ఆకట్టుకుంటున్నారు.
అదెలా అంటే హీరోయిన్ గా ఫాంలో ఉన్నా లేకున్నా.. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా.. తమ హాట్ ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంటారు కథానాయికలు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ ట్రెండ్ ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే ఫాంలో ఉన్న హీరోయిన్స్ కన్నా సరిగా అవకాశాలు లేని కొందరు భామలు తమ హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకుల హ్రుదయాలను కొల్లగొడుతున్నారు.
ఫోటో షూట్ లో తమలోని అందాలను బట్టబయలు చేస్తూ ఆడియెన్స్ ను ఊరించడం వీరికి అలవాటుగా మారింది. బికిని, టాప్ లెస్, ఇంకాస్త శృతి మించి దాచిపెట్టాల్సినవి చేతులతో కవర్ చేస్తూ న్యూడ్ పిక్స్ కూడా పెట్టేస్తున్నారు కొందరు హీరోయిన్స్. ఇలా చేసి ఆడియెన్స్ ను డిస్ట్రబ్ చేయడం వారికి అలవాటుగా మారింది. ఒకవేళ ఫోటో షూట్ లో కాస్టూం వేసుకున్నా అది కూడా వారి వయ్యారాలను ఒళకపోసేలా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.
అవకాశాలు ఎలా ఉన్నా హీరోయిన్స్ ఫోటో షూట్స్ తో ఉర్రూతలూగించడం మాత్రం ఖాయం. ఈ ఫోటో షూట్స్ లో ఎవరికి వారు తమ స్టైల్ ను ఎక్స్ పోజ్ చేస్తుంటారు. కొందరు చూపులతో.. మరికొందరు తమ అందాలతో ఎలాగైనా సరే ఆడియెన్స్ లో తమ అటెన్షన్ మిస్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంటారు. ప్రస్తుతానికి టూ పీస్ బికిని పిక్స్ తో రచ్చ చేస్తున్న భామలు ఇంకాత ముందుకెళ్తే ఇంకెలా రెచ్చిపోతారో అంటూ ఎక్సైటింగ్ గా ఉన్నారు ప్రేక్షకులు.