లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ పోస్ట్ పోన్..?

ఆర్జివి డైరక్షన్ లో వస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మార్చి 22న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ సమస్యల వల్ల ఈ సినిమా అనుకున్న టైంకు రిలీజ్ కష్టమే అంటున్నారు.

టిడిపి వ్యతిరేకంగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేయాలని సెన్సార్ వాళ్లు నిర్ణయించగా సినిమాకు కేవలం సర్టిఫికెట్ ఇవ్వడమే సెన్సార్ పని వాయిదా వేసే అధికారం లేదని ఈ విషయంపై కోర్టుకి వెళ్తానని అన్నాడు వర్మ.


ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం సెన్సార్ వారు ఈ సినిమా చూశాక రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందట. ఈ క్రమంలో మార్చి 22న అనుకున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మార్చి 29కి వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ పక్క ఏపిలో ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాపై టిడిపి వర్గాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏపి సిఎం చంద్రబాబుకి పూర్తి వ్యతిరేకంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుండగా ఈ సినిమా రిలీజ్ ను ఎన్నికల ముందు ఎలాగైనా అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు టిడిపి శ్రేణులు.