అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరాముడిపై తమ భక్తుని చాటుకున్నారు. సమీప ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అయితే నటి మంచు లక్ష్మీ తన రామభక్తిని ప్రత్యేకంగా చాటుకున్నారు.
అయోధ్య నుంచి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకను లాప్టాప్ లో లైవ్ చూస్తూ దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె షేర్ చేయగా… నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
కాగా, అయోధ్యలో నేటి నుంచి భక్తులకు బాలరామచంద్రుడి దర్శనం కల్పించనున్నారు. రఘునందనుడి దర్శనానికి ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్ లు ఖరారు చేసింది. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పించనుంది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ యంత్రాంగం చర్యలు చేపట్టింది.