రాంగోపాల్ వర్మకు మంచు మనోజ్ కౌంటర్..మీరు రింగ్‌ మాస్టారా !

-

టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ దిమ్మ తిరిగే కౌంటర్‌ ఇచ్చారు. మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ సభ్యులంతా సర్కస్‌ జోకర్స్‌ అయితే.. వాళ్లందరికీ మీరు రింగ్‌ మాస్టారా ? అంటూ రామ్‌ గోపాల్‌ వర్మకు హీరో మంచు మనోజ్‌ చురకలు అంటించారు. మా అర్టిస్ట్‌ అసోషియేషన్‌ లో ఉన్న వారంతా జోకర్స్‌ అయితే.. రామ్‌ గోపాల్‌ వర్మ కూడా జోకర్‌ అవుతారనేలా అర్ధం వచ్చేలా మంచు మనోజ్‌ ఆ ట్వీట్‌ చేశారు.

manchu manoj at singareni

ఇక మంచు మనోజ్‌ చేసిన ఈ ట్వీట్‌ పై నెటిజన్లు కూడా మంచు మనోజ్‌ కు సపోర్ట్‌ గా కామెంట్లు పెడుతున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ కు మంచి పంచ్‌ ఇచ్చారని నెటిజన్లు జోక్‌ లు పేల్చుతున్నారు. ఇక అంతకు ముందు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సర్కస్ అని… అందులో ఉండే సభ్యులంతా జోకర్లు అంటూ వర్మ సంచలన ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌ ఎటాక్‌ గా మంచు మనోజ్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news