రాజకీయాల్లోకి మంచు మనోజ్

-

మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ రాజకీయాల్లోకి వస్తున్నాడా..? రీల్ లైఫ్ హీరో కాస్త రియల్ లైఫ్ హీరోగా మారబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా సిని రంగ ప్రవేశం చేసిన మనోజ్ కెరియర్ మొదట్లో ఆడియెన్స్ ను అలరించినా రాను రాను ఎందుకో ప్రేక్షకాదరణ పొందే సినిమాలు అందించలేదు.

సినిమాలైతే చేస్తున్నాడు కాని మనోజ్ ఆశించిన ఫలితాలు అందుకోవడం లేదు. ఇక సినిమాలు రాణించడం కష్టం అని భావించాడో ఏమో కాని మనోజ్ తన మకాం ను హైదరాబాద్ నుండి తిరుపతికి మార్చేశాడు. ఇదే విషయాన్ని వెళ్లడిస్తూ తాను కొద్దిరోజులు తిరుపతిలో ఉంటానని చెప్పాడు. ప్రపంచంలో చాలా చోట్ల తిరిగిన తనకు తిరుపతిలోనే ప్రశాంతంగా అనిపిస్తుందని అన్నాడు.

ఈమధ్యనే సేవా కార్యక్రమాలు మొదలు పెట్టిన మనోజ్ రాజకీయాల్లోకి వెళ్లేందుకే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. మోహన్ బాబు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు అయితే ఆయన అంతగా ప్రభావం చూపించలేదు. మరి మంచు మనోజ్ అయినా సరే పాలిటిక్స్ లో రాణిస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version