BREAKING : ఇవాళ ఉదయం 8.30 గంటలకు మంచు మనోజ్ వివాహం

-

సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కోని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలపరంగా.. వ్యక్తిత్వం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్.. వైవాహిక జీవితంలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడని చెప్పాలి.

 

అయితే, తాజాగా మంచు ఫ్యామిలీ హీరో మనోజ్ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ఈ నేపథ్యంలోనే… మంచు మోహన్ బాబు ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహం ఇవాళ ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ లో జరగనుంది. వీరిద్దరికి ఇది రెండో వివాహం. ఈ వేడుకకు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం. బుధవారం మెహందీ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news