ప్రకాష్ రాజ్ కు షాక్ : పోస్టల్ బ్యాలెట్ ముందంజ లో మంచు విష్ణు

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. ఎవరూ ఊహించని రీతిలో… మంచు విష్ణు ప్యానల్ ముందంజలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్.. ప్రకాష్ రాజు ప్యానల్ కంటే ముందంజలో ఉన్నట్లు కాసేపటి క్రితమే ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో కీలకం కానున్నాయి.

అడుగు ఈసీ మెంబర్ లో ఓటర్లలో 50 ఓట్లు చెళ్లనివిగా ఎన్నికల అధికారులు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈసీ మెంబర్ల కౌంటింగ్ ప్రారంభం అయింది. మొదటగా ఈసీ మెంబర్ ల ఫలితాలు రానున్నాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో ముందంజ రావడంతో మంచు ప్యానల్ లో ఉత్సాహం నెలకొంది. ఇటు ప్రకాష్రాజ్ ప్యానల్ లో కాస్త అలజడి మొదలైంది. ఇవాళ రా త్రి 9 : 00  గంటల తర్వాతే ” మా ” అసోసి యేషన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రానున్నట్లు ఎన్నిక ల అధికారులు చెబుతున్నారు.