చీర‌క‌ట్టులో మంచుల‌క్ష్మీ మాస్ డ్యాన్స్‌.. మ‌ళ్లీ ఆడేసుకుంటున్న నెటిజ‌న్లు!

అదేంటో గానీ మోహ‌న్‌బాబు కుమార్తె మంచుల‌క్ష్మీ ఏది చేసినా అది చివ‌ర‌కు విమ‌ర్శ‌ల పాల‌వుతుంది. ఆమె మంచిదే అనుకుని చేస్తే నెటిజ‌న్లు మాత్రం ఆడేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఆమె కేటీఆర్‌పై చేసిన ట్వీట్ ఎన్నో విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. కాగా ఇప్పుడు కూడా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో మిశ్ర‌మ విమ‌ర్శ‌లు అందుకుంటోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

మంచుల‌క్ష్మీకి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఆమె చీరకట్టులో మాస్ డాన్స్ వేసి ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. మామూలు డ్రెస్సుల్లో కంటే చీర క‌ట్టులో డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్ గా ఉంటుంద‌ని ఆమె పోస్టు చేశారు. అయితే ఈ వీడియోలో ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా డ్యాన్సు చేసింది.

ఇక దీన్ని చూసిన నెటిజ‌న్లు కొంద‌రు చీర‌క‌ట్టులో డ్యాన్సు చేయ‌డాన్ని మెచ్చుకుంటున్నారు. ఇంకొంద‌రేమో ఆమె ఒంపుసొంపుల వయ్యారాలను చూసి ఇదేం డ్యాన్సు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఈ వీడియోలో త‌న నాభి అందాలతో కనువిందు చేయడంతో కొంద‌రు ఫ్యాన్స్ హాట్ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక ఆమె నాభికి ఓ రింగ్ కూడా పెట్టుకోవ‌డాన్ని చూసి చివ‌ర‌కు దాన్ని కూడా హైలెట్ చేస్తున్నారు నెటిజ‌న్తు. ఏదేమైనా మంచుల‌క్ష్మీ చేసిన డ్యాన్సు చివ‌ర‌కు ట్రోలింగ్‌కు దారి తీసింది.