సినీ ప్రపంచంలో సెలబ్రిటీలు ఏం చేసినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నరేష్ , పవిత్ర లోకేష్ బంధం పై విపరీతమైన చర్చలు, ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిం దే. అయితే, తాజాగా నరేష్ మరియు పవిత్ర పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు ఓ వీడియో ను రిలీజ్ చేశారు. కొంత మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఈ మేరకు నరేష్ ట్వీట్ చేసి.. వీడియో రిలీజ్ చేశాడు. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్లు.. ఏడు అడుగులు అంటూ ట్వీట్ చేశారు నరేష్.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముడ్లు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/ZsbYKcKT7g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023