కేసీఆర్ సెంటిమెంట్ స్ట్రాటజీ..ముందస్తు ప్లాన్ కష్టమే!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కే‌సి‌ఆర్ కుమార్తె కవితని ఈడీ విచారించబోతున్న విషయం తెలిసిందే. అలాగే ఆమె అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయో చెప్పలేం. అదే సమయంలో ఒకవేళ కవిత గాని అరెస్ట్ అయితే..కే‌సి‌ఆర్ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని కథనాలు వస్తున్నాయి. అంటే సెంటిమెంట్ అస్త్రంతో మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి లబ్ది పొందాలని చూస్తారని అంటున్నారు.

అంతకంటే ముందు ఢిల్లీలో కవిత మహిళా నేతలతో కలిసి దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల మహిళా సంఘాలతో కలిసి కవిత దీక్ష చేయనున్నారు. అయితే పూర్తిగా బి‌జే‌పిని ఇరుకున పెట్టే స్ట్రాటజీ అనే చెప్పాలి. అదే సమయంలో కవితకు పోటీగా తెలంగాణలో బి‌జే‌పి మహిళా నేతలు..రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, బెల్టు షాపులు..ఇలా పలు అంశాలపై కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నారు.

అయితే ఇక్కడ ఎవరికి వారు పోలిటికల్ గేమ్ ఆడుతున్నారు. వీరిలో ఎవరిని నమ్ముతారనేది ప్రజల ఇష్టం. కానీ కవిత గాని అరెస్ట్ అయితే కే‌సి‌ఆర్ ముందస్తుకు వెళ్తారనేది కూడా ఒక పోలిటికల్ స్ట్రాటజీ..అంటే తన కుమార్తెని కావాలని బి‌జే‌పి ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని చెప్పి ఎన్నికల్లో లబ్ది పొందే వ్యూహం.

కానీ ప్రజలు అన్నివేళలా సెంటిమెంట్‌కు పడిపోతారని అనుకోవడం అవివేకం…అది తెలుసుకోకుండా కే‌సి‌ఆర్ గుడ్డిగా ఏమి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే అవకాశం లేదు. పక్కాగా రాజకీయం నడుస్తున్నప్పుడు..కే‌సి‌ఆర్ ఎంత సెంటిమెంట్ తో ముందుకొచ్చిన జనం నమ్మరు. కాబట్టి కే‌సి‌ఆర్ ఇప్పుడున్న పరిస్తితుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వచ్చే ప్లాన్ చేయకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news