రేపు చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న‌ ఏపీ క్యాబినెట్ భేటీ..!

-

రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు స‌చివాలయంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న‌ ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సిఆర్డీఏ ఆధారిటీ లో అమోదించిన 37,702 కోట్ల టెండర్ల ప‌నులు చేప‌ట్టేందుకు అమోదం తెలపనుంది క్యాబినెట్. అలాగే క్యాబినెట్ అమోదంతో టెండ‌ర్లు ద‌క్కించుకున్న సంస్థ‌ల‌కు లెట‌ర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేయ‌నుంది సిఆర్డీఏ.ప్రస్తుతం సీఆర్డీఏ చేపట్టనున్న రూ.22,607 కోట్ల విలువైన 22 పనులకు ఆమోదం తెల‌ప‌నున్న క్యాబినెట్.. అమరావతి డెవల్మెంట్ కార్పోరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు ఆమోదం తెల‌ప‌నుంది.

అలాగే అమరావతిలో పను సంస్థలకు భూ కేటాయిoపులకు.. మున్సిపల్ శాఖ లోని పలు ఏజెండాలకు.. 4వ ఎస్ఐపిబి మీటింగ్ కు.. 10 సంస్థల ద్వారా వచ్చే రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు.. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట – రూ.1,742 కోట్ల పెట్టుబడులుకు.. దాల్మియా సిమెంట్ సంస్థ‌ కడప జిల్లా లో – రూ.2,883 కోట్ల పెట్టుబడులకు.. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ‌ విశాఖపట్నం న‌గ‌రంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెష‌న్ సెంట‌ర్ ఏర్పాటుకు.. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీ లో, రూ. 25,000 కోట్ల పెట్టుబడులకు.. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు.. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1,175 కోట్లు పెట్టుబ‌డుల‌కు.. ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ కంపెనీ. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలలో రూ.22,000 కోట్ల పెట్టుబడులకు అమోదం తెలపనుంది క్యాబినెట్. ఈ పెట్టుబడుల ద్వారా 80 వేల ఉద్యోగ మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version