గుంటూరు కారంలో హిట్-2 బ్యూటీ మీనాక్షి చౌదరి.. సూపర్ ఛాన్స్ కొట్టేసిందా..?

-

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్‌ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మూవీపై నెట్టింట తెగ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొదట మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు గుడ్ బై చెప్పారని.. ఆ తర్వాత బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా మూవీ నుంచి తప్పుకుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంకో విషయం తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే..?

పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్​ పేరు ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారిపోయింది. ఆమె మరెవరో కాదు ‘హిట్​ 2’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలైన మీనాక్షి చౌదరి. తాజాగా వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ సినిమా కోసం ఆమెను తీసుకునేందుకు ‘గుంటూరు కారం’ టీమ్‌ ఆసక్తి చూపుతుందని టాక్. అంతే కాకుండా ముందుగా సెకండ్‌ హీరోయిన్‌గా అనుకున్న శ్రీలీలను ఇప్పుడు లీడ్​ హీరోయిన్​గా తీసుకుని మీనాక్షిని రెండో హీరోయిన్‌గా తీసుకోనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news