ఎడిట్ నోట్: సెంట్రల్‌లో కేసీఆర్ ఎటు?

-

కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా దేశంలోని విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. రాజకీయం వారికి వారికి పలు వైరుధ్యం ఉంది. కానీ వారి టార్గెట్ మాత్రం మోదీ సర్కార్‌ని గద్దె దించడమే. కేంద్రంలో అధికారంలో ఉంటూ కేంద్ర సంస్థల అధికారాలని దుర్వినియోగం చేసి..ప్రత్యర్ధులని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పెద్ద వర్గాలకు అండగా ఉంటూ..పేద, మధ్య తరగతి వారి నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వాన్ని దించాలంటే విపక్షాలు ఏకం కావాలని చెప్పి..దేశంలోని దాదాపు 15 పార్టీలు బీహార్ లోని పాట్నాలో సమావేశమయ్యారు.

బీహార్ సి‌ఎం నితిశ్ కుమార్ అధ్వర్యంలో విపక్షాల ఐక్య సభ జరిగింది. ఈ సమావేశంలో 15 పార్టీల నుంచి 32 మంది నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్షాల భేటీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, తమిళనాడు, బెంగాల్‌, ఢిల్లీ, పంజాబ్‌, జార్ఖండ్‌ సీఎంలు ఎంకే స్టాలిన్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, హేమంత్‌ సోరెన్‌, ఆర్జేడీ నేత లాలూప్రసాద్‌ యాదవ్‌, సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ థాక్రే, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుప్రియా సూలే, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా పాల్గొన్నారు.

అయితే ఈ సమావేశానికి తెలంగాణలో అధికారంలో బి‌ఆర్‌ఎస్, ఒడిశాలో బి‌జే‌డి, ఏపీలో వైసీపీకని ఆహ్వానించలేదని తెలిసింది. కానీ బి‌జే‌డి, వైసీపీ బి‌జే‌పికి కాస్త అనుకూలంగా ముందుకెళుతున్నాయి. కానీ బి‌ఆర్‌ఎస్..బి‌జే‌పిపై పోరాటం చేస్తుంది. బి‌ఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్..తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. మోదీ సర్కార్‌ని గద్దె దించాలని చెప్పి..ఆయన కూడా విపక్ష నేతలని కలిశారు. మరి అలాంటప్పుడు ఆయనకు ఆహ్వానం అందలేదా? అనేది ఆశ్చర్యకరంగా మారింది.

Opposition parties

ఇదే సమయంలో ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులని కలుస్తున్న మంత్రి కే‌టి‌ఆర్.. కేంద్రంలో ప్రతిపక్షాలు ఏకం కావడం ద్వారా దేశానికి ఒరిగేది ఏమీ ఉండదని, కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందేనని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని, అధికారాలన్నీ ఢిల్లీలోనే కేంద్రీకృతం కావాలన్న ఆ రెండు పార్టీల భావనకు తాము పూర్తి వ్యతిరేమని అన్నారు. అంటే కాంగ్రెస్ కూడా విపక్షాల భేటీకి రావడంతో బి‌ఆర్‌ఎస్ దూరంగా ఉందా? అనే పరిస్తితి ఉంది. పైగా తెలంగాణలో బి‌ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు నడుస్తుంది. ఈ క్రమంలో విపక్షాల భేటీకి కే‌సి‌ఆర్ వెళితే పరిణామాలు మారిపోతాయి.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక..అప్పుడు గెలుపోటముల బట్టి కే‌సి‌ఆర్..జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తారని తెలుస్తుంది. అప్పటివరకు ఆయన ఫోకస్ తెలంగాణలో గెలవడంపైనే ఉంటుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news