అమ్మ గురించి మీనా కూతురు ఎమోషనల్.. వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న తలైవా

-

చైల్డ్ ఆర్టిస్ట్​గా ఎంట్రీ ఇచ్చి మూడు దశాబ్ధాల పాటు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా రాణించింది నటి మీనా. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున వంటి అగ్ర హీరోలందరితో నటించింది. అనేక హిట్లు సాధించింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప కూడా జన్మించింది. గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందారు.

మీనా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెలలో చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలంతా హాజరయ్యారు. మీనాను ఘనంగా సన్మానించారు. ఆ కార్యక్రమంలో సడెన్​గా మీనా కూతురు వీడియో ఒకటి పోస్టు చేశారు. ఆ వీడియో చూసి తలైవాతో పాటు అక్కడున్న తారలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.

“అమ్మా.. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్‌కు వెళ్లిపోయి చాక్లెట్స్‌ తింటూ కూర్చున్నా. ఆరోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డారో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకు నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవలే న్యూస్ ఛానెల్స్‌లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు” అంటూ నైనికా కోరింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news