20 ఏళ్ల తర్వాత రాబోతున్న 7/G బృందావన కాలనీ సీక్వెల్..

-

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నా కొన్ని మాత్రం ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోతూ ఉంటాయి. ఎన్నో ఏళ్లు గడిచిపోయిన ఆ సినిమాలని ప్రేక్షకులు మర్చిపోలేరు అలాంటి ఒక ట్రెండ్ సెట్టర్.. 7/G బృందావన కాలనీ.. దాదాపు 20 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

2003లో వచ్చిన బృందావనం కాలనీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పట్లో యువతని బాగా ఆకట్టుకుంది డిఫరెంట్ కాన్సెప్ట్ తో దొరికిన ఈ సినిమా సీక్వెల్ త్వరలో రాబోతుందంటూ చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాన్ని సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్టు తెలుస్తుంది.

7/G Brundavan Colony Movie || Ravi Krishna, His Friends Hilarious ...

సెల్వ రాఘవన్‌ డైరెక్షన్‌లో రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా పరిచయం అవ్వగా.. సోనియా అగర్వాల్‌ హీరోయిన్ గా నటించి మెప్పించింది. సీనియర్ నటుడు చంద్రమోహన్‌, విజయన్‌, సుమన్‌ శెట్టి, సుధ, మనోరమ లాంటి స్టార్ కాస్ట్ నటించిన ఈసినిమా 2004లో తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈసినిమా .. అటు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పటికీ యూత్ ఈసినిమాలో పాటల ఇష్టపడుతారు.. డైలాగ్స్ ను రీల్స్ గా చేస్తారు.. ఈమూవీ ఒక రకంగా చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

కాగా ఈ ఆల్‌టైమ్‌ సూపర్ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం చెప్పలేదు. ఈక్రమంలో ఇప్పుడు ఈ క్రేజీ సినిమా సీక్వెల్‌ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా జూలైలో సర్టిఫైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది హీరోగా రవికృష్ణ నటించిన డైరెక్టర్ గా సెల్వ రాఘవన్ ఈ సినిమాను తరికెక్కించాను అన్నట్టు తెలుస్తుంది ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావలసి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news