మీటూ అమైరాని వేధించిన సౌత్ హీరో..?

-

మీటూ అంటూ బాలీవుడ్ తారామణులు రోజుకో కొత్త విషయాన్ని వెళ్లడిస్తూ సంచలన విషయాలు బయటపెడుతున్నారు. బాలీవుడ్ భామలే కాదు సౌత్ సినిమాల్లో కూడా ఇలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కున్నట్టుగా హీరోయిన్స్ చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో భాగంగా హీరోయిన్ అమైరా దస్తర్ బాలీవుడ్ తో పాటుగా సౌత్ పరిశ్రమలో తనకు ఈ వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది.

బాలీవుడ్ లో కొందరు తనతో అసభ్యకరంగా ప్రవర్తించగా సౌత్ లో ఓ స్టార్ హీరో తనని ఇబ్బంది పెట్టాడని అన్నది. అంతేకాదు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. సౌత్ లో అమైరా దస్తర్ చేసింది కేవలం మూడు సినిమాలే.. అందులో రాజ్ తరుణ్, సందీప్ కిషన్ హీరోలుగా సినిమాలు చేసింది. ఇక ధనుష్ తో అనేకుడు సినిమా చేసింది. మరి అమ్మడు చెప్పిన కారణాలు చూస్తే అది ధనుష్ గురించే అన్నట్టు తెలుస్తుంది.

సుచి లీక్స్ లో ధనుష్ పై రకరకాల వార్తలు బయటకు వచ్చాయి. అయితే వాటిని ఎలాగోలా సర్ధుమనిగేలా చేయగా ఇప్పుడు అమైరా చేసిన కామెంట్స్ కు ధనుష్ బలవుతున్నాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news