అన్నకి ఎదురెళ్తున్న తమ్ముడు..?

-

మెగాస్టార్ చిరంజీవి వేసిన పూలబాటలోనే మిగతా మెగా హీరోలంతా నడుస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ చిరుకి ఎదురెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు చిరంజీవిని ఎదురించి మాట్లాడే ధైర్యం కూడా చేయరు కాని మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లో అన్నకి ఎదురెళ్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. అదేంటి అంటే మెగాస్టార్ చిరంజీవి తన సపోర్ట్ ను శివాజిరాజాకు అందిస్తున్నాడు. ఆ ప్యానెల్ లో శ్రీకాంత్ ఉన్నాడు కాబట్టి చిరు ఓటు శివాజి రాజా ప్యానెల్ కే వేస్తాడి. అంతేకాదు చిరు సపోర్ట్ వల్ల మిగతా కొందరు శివాజి రాజాకి సపోర్ట్ గా ఉంటున్నారు.

అయితే మరోపక్క సీనియర్ హీరో నరేష్ కూడా ఈసారి మా అధ్యక్షుడి పోటీలో ఉన్నాడు. మెగాస్టార్ ను కలిసినా లాభం లేదని తేలింది. అందుకే మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ తీసుకుంటున్నారు. శుక్రవారం నరేష్ ప్యానెల్ కు తన సపోర్ట్ ఇస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు నాగబాబు. ముఖ్యంగా నరేష్ ప్యానెల్ లో జీవిత ఉండటం వల్లే ఈ ప్యానెల్ కు తన సపోర్ట్ ఇస్తున్నా అని అన్నారు. మార్చ్ 10 ఆదివారం ‘మా’ ఎన్నికలు జరుగుతాయి. కొత్త అధ్యక్షుడు ఎవరన్నది తెలియాలంటే రేపు సాయంత్రం వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news