సెల్ఫీతో సందడి చేస్తున్న మెగా బ్రదర్స్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి ఓ చోట కలిస్తే మెగా ఫ్యాన్స్ కు పండుగే. ప్రస్తుతం అమెరికాలో ఈ ఇద్దరు కలవడం లంచ్ చేస్తూ సెల్ఫీ దిగి ఆ ఫోటోని వరుణ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. రాం చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ లో ఉండగా వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా చేస్తున్నాడు. మెగా బ్రదర్స్ ఇద్దరు కలిసి దిగిన ఈ సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఆర్.ఆర్.ఆర్ లో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ తో దిగిన సెల్ఫీలో రామరాజు మీసపు కట్టుతో రాం చరణ్ అదరగొట్టాడు. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నాడు. ఇద్దరు రియల్ హీరోస్ కథతో రాజమౌళి స్టైల్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.