మెగా ఫ్యాన్స్ కి మెగా స్టార్ బర్త్ డే గిఫ్ట్..ఆచార్య ఫస్ట్ లుక్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మాతగా తీసుకొస్తున్నారు. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. అయితే చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితం చిత్రయూనిట్ అధికారికంగా విడుదల చేసింది. చిరంజీవి ముందునుంచి చెప్తున్న విధంగానే సినిమా టైటిల్ ని ఆచార్య అని ఖరారు చేశారు.

నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో చిరంజీవి ఫైట్ చేస్తున్న సందర్భంలో ధర్మస్థలి అనే ఊరు ఆర్చ్ ఎదురుగా జరుగుతున్న ఫైట్ ని ఫస్ట్ లుక్ లో పొందుపరచింది.ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికీ సగభాగం షూటింగ్ కూడా సినిమాను పూర్తిచేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా తిరిగి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు