రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో పోలీస్ వ్యవస్థ తీరు అద్దం పట్టేలా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ హోమ్ శాఖపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఈరోజు స్వయంగా డిప్యూటీ సీఎం హోమ్ శాఖ విఫలమైందని చెప్పారు. బయటికి వెళ్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారని ,డీజీపీకి డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్నారు. లా అండ్ సరిగా లేదని డిప్యూటీ సీఎం చెబుతున్నారు. ఈ విషయం మేము రెండు నెలల క్రితమే చెప్పాం. రాష్ట్రంలో చిన్న పిల్లలను హత్య చేస్తున్నారు.. మహిళలపై అత్యాచారాలు, దారుణాలు పెరిగిపోయాయి.
వైసిపి ప్రభుత్వంలో 33,000 మంది మహిళలు ఆచూకీ లేరని గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మీరు అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళనైనా తీసుకొచ్చారా.. నేరాలు చేస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మడత పెట్టి కొట్టకూడదు. పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రి ఐతే ఏం జరుగుతుంది. యోగి ఆదిత్యనాథ్ ఏం చేశాడో అది చేస్తాడంట.. పవన్ నువ్వు ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావ్ అని అంబటి రాంబాబు అన్నారు.