బర్త్ డే స్పెషల్.. సాధారణ కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ ఎలా అయ్యాడు..!

-

ఇండియన్ సినిమాలో ఒకే ఒక్క మెగాస్టార్ అతడే కొణిదెల శివ శంకర వర ప్రసాద్ ఆయన్నే ముద్దుగా మనం అందరం మెగాస్టార్ చిరంజీవి అని పిలుస్తాం. రెండు దశాబ్ధాల కాలంగా బాక్సాఫీస్ పై తన ప్రతాపం చూపిస్తూ టాలీవుడ్ నెంబర్ వన్ చెయిర్ తన సొంతం చేసుకున్న మగ మహారాజు మన మెగాస్టార్ చిరంజీవి.

ఒక జానర్ సినిమాలకే పరిమితం కాకుండా నవరస కళాపోషణలు నిలువెత్తు దర్పణంగా నిలిచాడు చిరంజీవి. పక్కాగా చెప్పాలంటే తెలుగు సినిమాల స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన మొదటి కమర్షియల్ హీరో మెగాస్టార్. కేవలం సినిమాలే కాదు ఆయన అభిమానులకు ఇచ్చిన సోషల్ రివల్యూషన్ కూడా అందరిని షాక్ అయ్యేలా చేసింది.

కానిస్టేబుల్ కొడుకు.. ఇంటికి పెద్ద కొడుకుగా బాధ్యత మొత్తం తనదే. అయినా సరే ఎంచుకున్న రంగంలో ఎన్ని అవాంతరాలొచ్చినా వాటికి ఎదురొడ్డి నిలబడ్డాడు అందుకే ఆయన ప్రేక్షకుల మనసుల్లో కొండంత ప్రేమను సంపాదించారు. మెగాస్టార్ సినిమాల కలక్షన్స్ ధాటికి ఒకానొక సందర్భంలో బాలీవుడ్ దిగ్గజాలు కూడా అవాక్కయ్యేలా చేశాడు.

63 ఏళ్ల వయసులో కూడా బాక్సాఫీస్ సంచలనానికి నేను సై అంటూ సైరా నరసింహా రెడ్డిగా వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్వయంకృషే ఆయన్ను ఇంతవాడిని చేసింది.. తెలుగు సినిమా ఇంత గుర్తింపు తెచ్చుకుంది అంటే దానిలో మెగాస్టార్ పాత్ర ఎంత అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

చిరు సినిమా బాక్సాఫీస్ రికార్డుల లెక్క ఒకటని చెప్పలేం.. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసిన కొదమ సింహం చిరంజీవి. పదేళ్ళ తర్వాత ఖైది నెంబర్ 150 తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ పుట్టినరోజు లానే ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకుని మరెన్నో రికార్డులు సృష్టించాలని కోరుకుంటూ మెగాస్టార్ చిరంజీవికి మరొక్కసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మనలోకం.కామ్.

Read more RELATED
Recommended to you

Latest news