మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కు మెగాస్టార్ చిరంజీవి గుడ్ బై..?

Join Our Community
follow manalokam on social media

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ క్రమశిక్షణ సంఘ నుండి మెగాస్టార్ చిరంజీవి బయటకు వచ్చినట్టు లేటెస్ట్ టాక్. మాలోని గొడవలకు పరిష్కారం చూపించేలా సినీ పెద్దల చేత ఏర్పడింది మా క్రమశిక్షణ సంఘం. లాస్ట్ టైం మా అధ్యక్షుడిగా గెలిచిన నరేష్, ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర్ ల మధ్య గొడవ గురించి తెలిసిందే. ఆ టైం లోనే మా క్రమశిక్షణ సంఘం ఏర్పడింది. ఈ సంఘంలో చిరంజీవి, కృష్ణం రాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, జయసుధ లాంటి వారు ఉన్నారు.

Megastar Chiranjeevi resign to MAA

అయితే లేటెస్ట్ గా చిరంజీవి మా క్రమశిక్షణ సంఘానికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల మాలో జరిగే గొడవలను పట్టించుకోవడం కుదరదనో లేక ఈ గొడవలు తనకెందుకనో కాని చిరు మా క్రమశిక్షణ సంఘానికి గుడ్ బై చెప్పినట్టు ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో చిరుతో పాటుగా రాం చరణ్ కూడా నటిస్తున్నారు.

 

 

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...