గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఈ యాప్‌ అవుట్‌!

-

ఇప్పుడు మీరు తెలుసుకోబోయే యాప్‌ మీరు డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్‌ చేయండి. ఈ ఆండ్రాయిడ్‌ సర్వీస్‌ యాప్‌ను ఇన్ స్టాల్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ యాక్సెస్‌ను ఉచితంగా పొందొచ్చని వినియోగదారులకు ఈ ఫేక్‌ యాప్‌ మోసాలకు పాల్పడుతున్నారు. అసలు విషయం తెలియకుండా ఈ యాప్‌ను ఇన్ స్టాల్‌ చేసుకున్న వారి వాట్సాప్‌ డేటాను తస్కరిస్తున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఓటీటీ . టీవీ షోలతో పాటు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇలా ఒకటేంటి వినోదమంతా ఈ నెట్‌ఫ్లిక్స్‌లోనే నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని మీరూ ఆస్వాదించాలంటే మెంబర్‌షిప్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే.. కొందరు సైబర్‌ నేరగాళ్లు ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంకు ఉన్న వినియోగదారుల ఆదరణను క్యాష్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ ఫేక్‌ మెసేజ్‌ను ఫార్వార్డ్‌ చేసింది. ఇప్పటికే ఫేక్‌ యాప్స్‌ను నిరోధించేందుకు గూగుల్‌ ఎంత ప్రయత్నిస్తున్నా.. అవి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌ను వేదికగా చేసుకుని నెటిజన్లను బురిడీ కొట్టించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా.. అలాంటి ఫేక్‌ యాప్‌ ఒకటి గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్నట్లు సైబర్‌ సెక్యురిటీ పరిశోధకులు గుర్తించారు. ఆండ్రాయిడ్‌ సర్వీస్‌ యాప్‌ ‘ఫ్లిక్స్‌ ఆన్‌లై న్‌’ పేరుతో గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ ఫేక్‌ యాప్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులే లక్ష్యంగా జనాలను మాయబుచ్చుతున్నట్లు తేల్చారు. ఈ ‘ఫ్లిక్స్‌ ఆన్‌ లైన్‌’ యాప్‌ను ఇన్‌ స్టాల్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ యాక్సెస్‌ను ఉచితంగా పొందొచ్చని వినియోగదారులకు ఈ ఫేక్‌ యాప్‌ ద్వారా హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు.ఇన్‌ స్టాల్‌ చేసుకున్న వారి వాట్సాప్‌ డేటాను తస్కరిస్తున్నారు. అంతేకాదు.. వాట్సాప్‌ నోటిఫికేషన్లను మోనిటర్‌ చేస్తున్నారు. ఎవరైనా మీకు వాట్సాప్‌లో మెసేజ్‌ చేస్తే వారికి ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే దానికి జవాబు ఇస్తున్నారు.

ఇలా మెసేజ్‌లకు జవాబు ఇస్తూ మాల్‌వేర్‌ను హ్యాకర్లు వాట్సాప్‌లోకి పంపుతున్నారని సైబర్‌ సెక్యురిటీ రీసెర్చర్స్‌ తెలిపారు. అలా మాల్‌వేర్‌ను పంపి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, వాట్సప్‌ అకౌంట్‌కు సంబంధించిన క్రెడెన్షియల్స్‌ను తస్కరించడం, వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పొరపాటున ఆ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేస్తే.. మాల్‌వేర్‌ సర్వీస్‌ రిక్వెస్ట్‌లను పంపిస్తుందని, Overlay’, ‘Battery Optimization Ignore’, and ‘Notification అరి పర్మిషన్‌ అడుగుతుంది.

దీనికి మీరు యాక్సెస్‌ ఇచ్చారా.. మీ ఫోన్‌ లోకి మాల్‌వేర్‌ పూర్తి స్థాయిలో ప్రవేశిస్తుంది. మీ వాట్సప్‌ నెంబర్‌ నుంచి తప్పుడు సమాచారం గ్రూప్స్‌లో, వ్యక్తిగత నంబర్లకు వెళ్లే అవకాశముంది.
భద్రత పరిశోధకులు ఈ న ఖిలీ యాప్‌ గురించి గూగుల్‌కు సమాచారమందించారు. అయితే ఇప్పటికే ఈ ఫేక్‌ యాప్‌ను 500 మంది డౌన్‌ లోడ్‌ చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news