సైరా టీజర్ సంచలనాలు..!

-

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ ప్రెస్టిజియస్ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన గంటలోనే 1 మిలియన్.. రోజులో 6 మిలియన్స్ పైగా వ్యూయర్ కౌంట్ సాధించిన సైరా నరసింహా రెడ్డి మూవీ టీజర్ రోజు గడిచిందో లేదో రికార్డుల వేట మొదలు పెట్టింది.

సైరా టీజర్ ఇప్పటివరకు అత్యధికంగా 12 మిలియన్స్ వ్యూయర్ కౌంట్ సాధించిందట. మన లెక్కలో చెప్పాలంటే 1 కోటి 20 లక్షల వ్యూస్ అన్నమాట. సైరా లుక్ తో మెగాస్టార్ మెగా అభిమానులను అలరించాడు. సినిమా టీజర్ తోనే సత్తా చాటగా 2019 సమ్మర్ లో రిలీజ్ అవనున్న ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరి టీజర్ తో మొదలైనె సైరా సంచలనాలు ఆఫ్టర్ రిలీజ్ దాకా కొనసాగించేలా ఉంది. అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్న సైరా సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా చేస్తుంది. అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news