బిగ్ బాస్-3 కోసం విజయ్..?

-

స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ చేయగా సెకండ్ సీజన్ లో నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత సెట్ రైట్ అయ్యాడు. ఫైనల్ గా బిగ్ బాస్ సెకండ్ సీజన్ 10 వారాలను పూర్తి చేసుకుని సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది.

ఇక ఈ బిగ్ బాస్ ముగింపుకు వస్తుంది.. లాస్ట్ సీజన్ లా పెద్దగా గ్యాప్ లేకుండా బిగ్ బాస్ థర్డ్ సీజన్ మొదలు పెట్టనున్నారట నిర్వాహకులు. అయితే ఈసారి హోస్ట్ గా ఎవరిని తీసుకుంటారు అన్న దాని మీద చర్చ జరుగుతుంది. రీసెంట్ గా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ బిగ్ బాస్ 3వ సీజన్ కు హోస్ట్ గా చేస్తే ఎలా ఉంటుందో అని ఆలోచన వచ్చింది. అతని ఫాన్స్ ఇదే విషయాన్ని అతనితో అడిగారు.

గీతా గోవిందం ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ లేడీ ఫ్యాన్స్ తో స్పెషల్ చిట్ చాట్ ప్లాన్ చేశారు. నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ పై తన అభిప్రాయం అడుగగా అర్జున్ రెడ్డి టైంలో మొదటి సీజన్ కు వెళ్లానని చెప్పిన విజయ్ ఆ అట్మాస్పియర్ తనకి నచ్చలేదని అన్నాడు. అంతేకాదు నాని షోలో కూడా వెళ్లానని.. ఒకవేళ బిగ్ బాస్ హోస్ట్ గా ఛాన్స్ వచ్చినా తాను మొహమాటం లేకుండా నో అని చెప్పేస్తా అన్నాడు విజయ్. సో బిగ్ బాస్ 3 హోస్ట్ గా విజయ్ ను ఊహించుకోవడం వేస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news