మెగాస్టార్ ఐడి‌యా కొర‌టాలని హ‌ర్ట్ చేస్తోందా?

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ – మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య దూరం పెరుగుతోందా? అంటే టాలీవుడ్ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం `ఆచార్య‌`. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌త ఏడు నెల‌లుగా లాక్‌డౌన్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది.

అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా పెద్ద సినిమాల‌న్నీ మ‌ళ్లీ సెట్స్ పైకి వ‌చ్చేస్తున్నాయి. నాగార్జున సినిమా నుంచి అఖిల్ మూవీ వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రి సినిమాలు సెట్‌పైకి వ‌చ్చేశాయి. కానీ చిరు చిత్రం మాత్రం ఇంకా సెట్‌పైకి రాలేదు. ఈ నేప‌థ్యంలో `ఆచార్య‌` షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని, వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కొర‌టాల భావిస్తున్నాడ‌ట‌. కానీ చిరు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వంట‌లు చేస్తూ పిల్ల‌ల‌తో ఛిల్ అవుతున్నారు.

ఇదిలా వుంటే మెగాస్టార్ చేసిన ప‌ని కొర‌టాల‌ని మ‌రింత‌గా హ‌ర్ట్ చేసింద‌ని చెబుతున్నారు. స్టోరీ సీరియ‌స్ గా వుంద‌ని కొంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ ని జోడించ‌మ‌ని అందుకు రైట‌ర్ శ్రీ‌ధ‌ర్ సీపాన‌ని స్క్రీన్‌ప్లే యాడ్ చేశార‌ట‌. ఈ ఐడియా కొర‌టాల కి అస్స‌లు న‌చ్చ‌లేద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీంతో చిరుతో వాదించ‌లేక బ‌న్నీ ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ అవ్వాల‌నుకుంటున్నార‌ట‌. దీంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో `ఆచార్య‌` హాట్ టాపిక్‌గా మారింది.