జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ-ఓటింగ్

-

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తొలిసారిగా ఈ-ఓటింగ్ సదుపాయం కల్పించనున్నారు ఎన్నికల అధికారులు. ప్రయోగాత్మకంగా వృద్ధుల కోసమే ఈ-ఓటింగ్ నిర్వహించనున్నారు. కరోనా వల్ల క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లకు, వృద్ధులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఆన్‌ లైన్‌ లో ఓటు పై సాంకేతిక నిపుణులతో ఈసీ సమావేశమైంది. దాని కోసమే త్వరలోనే కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది ఐటీ శాఖ.

భవిష్యత్‌లో జరిగే ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ-ఓటింగ్ విధానం అమలు చేసే యోచనలో ఉన్నారు ఎన్నికల అధికారులు. వచ్చే ఫిబ్రవరిలో గ్రేటర్ ఎలెక్టెడ్ బాడీ పదవీ కాలం ముగుస్తున్న క్రమంలో అంతకు మూడు నెలల ముందే కొత్త బాడీని ఎన్నుకోవాలని గతంలో అధికారులు అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నుండి ఓటర్ జాబితా రాగానే వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వరదలు కూడా వచ్చిన నేపధ్యంలో ఎన్నికలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news