టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి.. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబోలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి. ఉగాది కానుకగా ఈ చిత్రబృందం ఈ మూవీలో నుంచి నోనోనో అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది.
నీ స్నేహం, నీ మోహం.. నీ బంధం, అనుబంధం.. ప్రేమించే సమయం లేదే.. ప్రేమన్నా ప్రశ్నే లేదే.. అని సోలో లైఫ్ బెటర్ అంటూ స్టైలిష్‌గా సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను ఎంఎం మానసి పాడారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి 20 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా.. అనుష్క 40 ఏళ్ల మహిళగా కనిపించబోతుంది. సోలో లైఫ్‌ను ఎంజాయ్ చేసే ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.