ఓటీటీలోకి వచ్చేసిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

-

గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందర్నీ మెప్పించిన సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి.  అనుష్క, నవీన్‌ పొలిశెట్టి కీలక పాత్రల్లో పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్​లోకి సందడి చేసింది.  గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అనుష్క నటన, నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఫిదా చేశాయి. డీసెంట్ టాక్​తో ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈరోజు నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Miss Shetty Mr Polishetty OTT Release Date

అన్వి అలియాస్‌ అన్విత రవళి శెట్టి(అనుష్క) మాస్టర్‌ చెఫ్‌. లండన్‌లో ఓ పెద్ద స్టార్‌ హోటల్‌లో పని చేస్తుంటుంది. తనకు ప్రేమ, పెళ్లి, రిలేషన్‌ షిప్స్‌పై ఏమాత్రం నమ్మకం ఉండదు. తన తల్లి అనారోగ్యంతో కన్నుమూశాక అన్వి ఒంటరవుతుంది. దాని నుంచి బయట పడటానికి తోడు వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. దీనికోసం వీర్య దాత కోసం వెతుకుతుండగా.. స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి (నవీన్‌ పొలిశెట్టి) పరిచయమవుతాడు. అన్వి తనపై చూపిస్తున్న కేర్‌ను చూసి ఆమెతో ప్రేమలో పడిన సిద్ధు ఓరోజు తనకు ప్రపోజ్‌ చేస్తాడు. కానీ, ప్రేమ, పెళ్లిపై నమ్మకం లేని అన్వి తాను సిద్ధుకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మరి అన్విత తాను అనుకున్నది సాధించిందా? ఆమె భారత్‌ నుంచి లండన్‌కు ఎందుకు తిరిగి వెళ్లిపోయింది? సిద్ధు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను ఎలా మార్చాడు? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది మిగతా కథ.

Read more RELATED
Recommended to you

Latest news