ఎన్టీఆర్ బాబాయి పాత్రలో ఆయనే…!

-

టాలీవుడ్ లో ట్రిపుల్ ఆర్ సినిమా ఇప్పుడు ఒక సంచలనం. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ నందమూరి అభిమానులతో పాటుగా మెగా ఫాన్స్ ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ ఒకటి విడుదల చేసారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇక త్వరలోనే ఎన్టీఆర్ లుక్ కూడా బయటకు రానుంది.

ఈ సినిమాను ఎలా అయినా సరే సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా లో ఇప్పుడు ఒక కీలక నటుడు ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కి బాబాయి గా మోహన్ లాల్ ని ఎంపిక చేసినట్టు సమాచారం.

వీరి కాంబినేషన్ జనతా గ్యారేజ్ సినిమాలో కనపడింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. దీనిపై త్వరలో చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేయనుంది. మోహన్ లాల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు కీలక పాత్ర ఇస్తే కేరళ లో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news