బ్లాక్ లో మద్యం ఇంత దారుణమా… పిచ్చి మందు… పెగ్ ఎంతో తెలుసా…?

మద్యం దొరకక జనాలకు పిచ్చి ఎక్కుతుంది అనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. మద్యానికి బానిస అయిన వాళ్ళు ఇప్పుడు దాని కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని తమకు మద్యం అందించాలని ఎందరో వేడుకునే పరిస్థితి ఉంది. దేశ వ్యాప్తంగా మద్యానికి బానిసలు గా మారిన వాళ్లకు… ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని కొన్ని కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాయి.

వాళ్ళు అందరూ ఇప్పుడు మానసిక రోగులుగా మారుతున్నారు. కల్తీ కల్లుకి అలవాటు పడిన వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు దీనిని కొందరు ఆసరాగా తీసుకున్నారు. వంద రూపాయలు కూడా లేని క్వార్టర్ ని 300 నుంచి 400 వరకు విక్రయించడం మొదలుపెట్టారు. అలాగే పెగ్ మందు ఇప్పుడు వంద నుంచి 150 వరకు అమ్ముతున్నారు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఒక పక్క ప్రభుత్వం అమ్మ వద్దు అని చెప్తున్నా సరే ప్రభుత్వం మాత్రం వినడం లేదు. ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్నాయని కాబట్టి ఇప్పట్లో మద్యం షాపులు తెరిచే అవకాశాలు లేవు కాబట్టి… ఇక బ్లాక్ లో మధ్యం అమ్మే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అసలే ఆర్ధికంగా జనం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ పరిణామం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీనిపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.