మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ తన సహజ నటనతో భాషాబేధం లేకుండా అభిమానులను ఏర్పరచుకున్నాడు. ఈమధ్య తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న మోహన్ లాల్ ప్రస్తుతం మళయాళంలో చేస్తున్న సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో మోహన్ లాల్ క్రేజీ రోల్ చేస్తున్నారట. కొంత భాగం యువకుడిగా.. మరికొంత భాగం కురు వృద్ధుడిగా.. మధ్య వయస్థుడిగా ఇలా డిఫరెంట్ స్టైల్ లో కనిపిస్తాడట.
అంతేకాదు కొన్ని సీన్స్ లో మోహన్ లాల్ జంతువు రూపంలో కూడా కనిపిస్తాడని అంటున్నారు. శ్రీకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫాంటసీ కథతో తెరకెక్కుతుందట. ఈ సినిమాతో మోహన్ లాల్ మరో ప్రయోగం చేస్తున్నాడు. ఈ వయసులో యంగ్ హీరోలకు పోటీగా తన సత్తా చాటుతున్నాడు మోహన్ లాల్.
తెలుగులో జనతా గ్యారేజ్, మనమంతా సినిమాల తర్వాత ఆయనకు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే మళాయలంలో సూపర్ బజ్ ఏర్పడిన సినిమాలను ఇక్కడ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.