దక్షిణాదిలో హీరోయిన్లు కావాలంటే ఇప్పడందరు కన్నడ బ్యూటీస్ వెంట పడుతున్నారు.టీవీ చానల్లకే కాకుండా.. సినిమాలకు అక్కడి నటీమణులు కరెక్ట్ గా సెట్ అయిపోతున్నారు. గతకొంతకాలంగా తెలుగు పరిశ్రమలో రష్మిక లాంటి కన్నడిగుల హవా పెరిగిపోతుంది. కన్నడ పరిశ్రమకు ధీటుగా మలయాళ తీరం కనిపిస్తున్నప్పటికీ… ఎందుకనో మనవాళ్లు మునుపటిలా అక్కడి తారలను తెచ్చుకుని ఇక్కడ సినిమాలు చేయడం లేదు.
జస్ట్ సాయిపల్లవి,అనుపమ పరమేశ్వరన్ తోనే మనం సరిపెట్టేసుకుంటున్నాం.అను ఇమాన్యుయల్ ,మంజిమా మోహన్ ,మడోనా సెబాస్టియన్ లన్నారనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాం.వీరిలో ఎవరో ఒకరు బ్లాక్ బస్టర్ సినిమాలో చేస్తేగాని బహుశా మనం వీరిని పికప్ చేసుకోలేమనుకుంట. పేటతో కలరింగ్ ఇచ్చి..మాస్టర్ తో స్టయిల్ గా లుక్ ఇచ్చిన మాళవిక మోహన్ ఇప్పుడు తెలుగు దర్శకులకు హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది.మాస్టర్ రిలీజై హిట్ పడితే ఆమెకు తెలుగులో రెండు మూడు ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యం లేదు.
మాళవిక మోహనన్ తో పాటు…తాజాగా నిఖిలా విమల్ ,దీప్తి సతి,సంయుక్త మీనన్ లాంటి హీరోయిన్లు టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.వీరిని మనవాళ్లు తీసుకోవాలంటే సాలిడ్ హిట్ అయినా పడాలి… లేదంటే లవ్ స్టోరీస్ హ్యాండిల్ చేసే శేఖర్ కమ్ముల,ఇంద్రగంటి వారు వీరి క్రేజ్ చూసి తమ సినిమాకైనా తీసుకోవాలి.అప్పుడే వీరికంటూ తెలుగులో సినిమాలు వచ్చేది.
అలాగే నమితా ప్రమోద్ ,గుజరాతి గాళ్ అనార్కలి ఫేం ప్రియా గోర్ ,బెంగుళూరు డేస్ ఫేం పార్వతిలను తెలుగు సినీ ఆడియన్స్ నెట్టింట్లో ఎంతగానో ఆదరిస్తున్నారు.వారి ఇన్ స్టా అకౌంట్ లను మన కేరళ బ్యాచ్ కంటే ఎక్కువగా ఫాలో అయిపోతున్నారు.మరి ఇంతలా ఫాలోయింగ్ ఉన్నా కూడా మాలీవుడ్ బ్యూటీస్ ను మనవాళ్లు ఎందుకు ఇక్కడకు తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారు.