తారల జన్మస్థానం తెలియదు
ఏ ఇలవేల్పు అలా వెలిగే వరాన్ని ప్రసాదించాడని
కానీ అతడి నటన జన్మస్థానం నాకు తెల్సు
నట రాజ విశ్వరూపమూ తెల్సు
అది జగద్విఖ్యాతం జన్యుగతం
ఔనండి తారక్ మాత్రమే చేయగలడు..
పది తలల రావణ బ్రహ్మగా అంతెత్తు నటనను ప్రదర్శించగలడు
నిజంగానే వాడు నిన్నటి దాకా మంచి నటుడు ఇప్పుడు మహా నటుడు
…………………………
అన్నయ్య పాదాల చెంత భరతుడు..కన్నీరులొలికిస్తున్
పురుషోత్తమా నీవే అంతా కదా అని ప్రాథేయ పడుతున్నాడు..
ఈ ఒక్క సన్నివేశం చాలు రామలక్ష్మణ భరతుల్ని
వాడొక్కడిలోనే చూసేం దుకు..
వహ్!! నిజంగా పెద్దాయన అంశతోనే పుట్టాడు వీడు.
…………………………
ఎప్పుడొస్తాందా పాత్ర .. అసుర అసుర అంటూ శబ్దిస్తూ వచ్చే పాత్ర
నరం నరం అహం నింపుకున్న పాత్ర అవమానంతో రగిలిపోయిన పాత్ర
గుప్పెడు ప్రేమకు నోచుకోని పాత్ర.. ఎన్నెన్ని పార్శాలు ఎన్నెన్ని విభిన్నతలు
వాడొక్కడే రావణ బ్రహ్మకు సరితూగగలడు..
వాడొక్కడే నటన వారసత్వం కాదండి అదొక తపన అని చెప్పగలడు
…………………………
మళ్లీ బాగా తెల్సిన రెండు పాత్రలు లవ, కుశల రూపంలో పరిచయం అయ్యాయి..నచ్చలేదు. రొటీన్ సీన్స్ పరమ బోర్ నచ్చలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో రావణుడొచ్చాడు/నచ్చాడు.. ఆ రౌద్రం ఆ శాసనం ఆ భీతావహ ప్రదర్శనం నచ్చింది/ఔనండి.. ఈ సినిమా తరువాత తారక్ తనలోని నటుడికి ఇంకా ఇంకా పని చెప్పాలి /లేదంటే పరమ బోర్. విలక్షణతను ప్రకాశ్ రాజ్ మాత్రమేనా అంతకుమించి ప్రదర్శించాడు తారక్.వహ్! వీడేరా నటుడు వీడేనా ఇంతవరకూ మనకు తెల్సిన నటుడు .. అదిరిందిపో.. తారక రాముడా!! నీకు జయము నీకు శుభము.
…………………………
మన దగ్గర నటులు లేరు స్టార్స్ ఉన్నారు
కాదండి తెరవేల్పులు ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు
అసలా అర్హత మహానటుడు ఎన్టీఆరే దక్కించుకున్నాడు
ఇప్పుడు మళ్లీ నటులొస్తున్నారు జీవం పోస్తున్నారు
తమని తాము సరికొత్తగా నిర్వచించుకుంటున్నారు
పాత్ర ఏదైనా విలక్షణత ఉంటేనే ఓటేస్తున్నారు
…………………………
తారక్ లాంటి నటుడు ఈ పండుగ వేళ ఆనంద హేలని పంచాడు..ఈ దసరా వేళ దశకంఠుడిగా అవతరించి నటనకు పర్యాయపదంగా నిలిచాడు.అతిశయమా ఇది కాదు కదా! అనన్య సామాన్యమి ది.వాడు నాకు తెల్సు.. మా శబ్దాలయ బ్యానర్ కి వాడు బాల రాముడు వాడు నాకు తెల్సు.. రొటీన్ రోల్స్‌తో మొహం మొత్తించిన సందర్భాలూ తెల్సు.ఇప్పుడు నాకు వాడు కొత్త.. తెరపై కొత్త.. కథని ఎంచుకోవడంలో కొత్త .. ఎనీ డౌట్స్ ..
…………………………
ఔను! ప్రేమ గుర్తింపుని కోరుకోవాలి అన్నది వీడి ప్రయత్నం
ఓ గొప్ప గుర్తింపుని సుస్థిరం చేసుకోవాలి అన్నది నా మాట
అంటున్నా రావణా నీకు జై .. తారక్ రాముడా నీకు జై
ఔను! లవ కుశ అనే మంచి ముందు నిలిచిన వాడు జై
చెడు నుంచి మంచి.. చెడును అంతమొందించిన మంచి
ఈ పండుగ సందేశం ఇదే కదా!
…………………………
మళ్లీ తారక్ కి జై కొడతా.. మన మధ్య నడయాడు ఈ తార వేవేల వెలుగులతో వర్థిల్లుగాక! నాకు తెల్సు ఇంకా ఇంకా అతడి తృష్ణ తీరలేదని.. ఔను! వాడి నటనని వర్ణించేందుకు పదాలు లేవని!అతిశయమా ఇది! ఇంకా కొత్త గా వస్తున్నవారో ఇంకా ఇక్కడే తమని తాము నిరూపించుకోవాలను కుంటున్నవారోతారక్ ని చూసి నేర్చుకోవాలేమో! నటనకి కొత్త భాష్యం నాలుగు గదుల మధ్య బోధిం చు పాఠాల్లో పుట్టదు..ప్రతిధ్వనించదు.