మరో 18 చానళ్లను నిషేధించిన మూవీ ఆర్ట్స్ అసోసియేషన్..!

-

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్ మంచు విష్ణు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ట్రోలింగ్, అసభ్యకరమైన వీడియోలు చేసే వారి పట్ల ఇటీవలే అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో యూట్యూబ్ చానళ్లు నడిపే వారికి వార్నింగ్ ఇస్తూ.. పలు చానల్స్ రద్దు అయ్యేలా చేసాడు. ఇటీవలే నటీనటులపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబర్ల పై తెలంగాణ డీజీపీకి కూడా ఫిర్యాదు చేసింది మా అసోసియేషన్. ఇటీవలే 25 యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేసారు. తాజాగా మరో 18 ఛానళ్లను నిషేదించింది మా అసోసియేషన్. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

  1. బ్రాహ్మి ట్రోల్స్ 3.0, 2. టీకే క్రియేషన్స్. 3. నవీన్ క్రిష్ 4. రేసింగ్ ఉమాపతి 5. డాక్టర్స్ ట్రోల్స్ 6. నేను మీ జాను 7. లైక్ చాయ్ బ్రో 8. రాజ్ తేజ్ vlogs 9. ట్రోలింగ్ పోరడు 10. ఇదియాపారం 11. 1 M ట్రోల్స్ 12. అప్డేట్ ట్రోల్స్ 13. మై ఛానల్ మై రూల్స్ 14. కామెడీ ట్రోలింగ్ 15. కింగ్ చంద్రహాస్ 16. కేసీపీడీ ట్రోల్స్ 17. కామెడీ ట్రోలింగ్  18. డీవీవీ మోడర్న్ ట్రోల్స్ వంటి ఛానల్స్ రద్దు చేసింది మా అసోసియేషన్.

Read more RELATED
Recommended to you

Latest news