కేకే అంటే.. కేకే అంటే ఎవరు.. విక్రమ్ ‘మిస్టర్ కేకే’ ట్రైలర్ వచ్చేసింది..!

-

ఈ సినిమాలో విక్రమ్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. అక్షర హాసన్ గర్భవతిగా నటిస్తోంది. ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లను విక్రమ్ అడ్డుకోవడం కోసం విక్రమ్ రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో సినిమా కథ నడుస్తుంది.

హీరో విక్రమ్ అంటేనే సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన సినిమాలు సరికొత్తగా ఉంటాయి. కాకపోతే ఈ మధ్య ఆయన నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ అవుతున్నాయి. అయితే.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో మిస్టర్ కేకే అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విక్రమ్.

అవును.. మిస్టర్ కేకే అనే సినిమాలో విక్రమ్ నటిస్తున్నాడు. కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. కమల్ గారాలపట్టి.. అక్షర హాసన్ ఈ సినిమాలో మరో లీడ్ రోల్ పోషిస్తోంది. రాజేశ్ ఎమ్ సెల్వ ఈ సినిమా డైరెక్టర్.

ఈ సినిమాలో విక్రమ్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. అక్షర హాసన్ గర్భవతిగా నటిస్తోంది. ఆమెను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లను విక్రమ్ అడ్డుకోవడం కోసం విక్రమ్ రంగంలోకి దిగుతాడు. ఆ నేపథ్యంలో సినిమా కథ నడుస్తుంది. మొత్తానికి ఈసారి సరికొత్త గెటప్ తో విక్రమ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. తమిళం, తెలుగు భాషల్లో వస్తున్న ఈ సినిమా అఫిషియల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇంకెందుకు ఆలస్యం.. రెండు భాషల్లో విడుదలయిన ట్రైలర్ ను చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news