దీవాళికి మల్టీస్టారర్ ట్రీట్

-

మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగిస్తున్న టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న సినిమ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్-2 దీపావళి కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ తీసిన మూడు సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి ఎఫ్-2 అంటూ మల్టీస్టారర్ ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా తన సినిమాలను చేసే అనీల్ రావిపుడి ఈ సినిమాతో కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కు జంటగా మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. 2019 సంక్రాంతి బరిలో దిగేలా వస్తున్న ఈ ఎఫ్-2 ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి. గురు తర్వాత వెంకటేష్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి మల్టీస్టారర్ లో కొత్త ట్రెండ్ సృష్టించేలా ఎఫ్-2 ఆడియెన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news